AB Venkateswararao: సీనియ‌ర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును స‌ర్వీసులోకి తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వ నిర్ణ‌యం

AP Government Decide to Posting to AB Venkateswararao
  • ఈ మేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసిన సీఎస్ జ‌వ‌హర్ రెడ్డి 
  • ఇవాళ ఉద్యోగ విర‌మ‌ణ దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం
  • మ‌రి కాసేప‌ట్లో ఏబీకి పోస్టింగ్ ఉత్త‌ర్వులు ఇవ్వ‌నున్న ప్ర‌భుత్వం
సీనియ‌ర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును స‌ర్వీసులోకి తీసుకోవాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇవాళ ఉద్యోగ విర‌మ‌ణ దృష్ట్యా పోస్టింగ్ ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేర‌కు సీఎస్ జ‌వ‌హర్ రెడ్డి ఉత్త‌ర్వులు జారీ చేశారు. స‌ర్వీసులోకి తీసుకునేందుకు వీలుగా ఆయ‌న‌పై స‌స్పెన్ష‌న్ ఎత్తివేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

దీనిలో భాగంగా మ‌రి కాసేప‌ట్లోనే ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుకు ప్ర‌భుత్వం పోస్టింగ్ ఉత్త‌ర్వులు ఇవ్వ‌నుంది. కాగా, వెంకటేశ్వరరావుపై సస్పెన్ష‌న్‌ను ఎత్తివేస్తూ ఇటీవ‌ల క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యం, దానిని హైకోర్టు కూడా సమర్థించిన విషయం తెలిసిందే.
AB Venkateswararao
AP Government
Andhra Pradesh

More Telugu News