Vallabhaneni Vamsi: భరతనాట్యంతో అలరించిన వల్లభనేని వంశీ కుమార్తె... వీడియో ఇదిగో!

Vallabhaneni Vamsi daughter enthralled with Bharatanatyam
  • విజయవాడలో వల్లభనేని వంశీ కుమార్తె నాట్య ప్రదర్శన
  • చక్కని అభినయం, నాట్యంతో ఆకట్టుకున్న వల్లభనేని శ్రీలక్ష్మి వసుంధర
  • సతీసమేతంగా విచ్చేసిన కొడాలి నాని
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కుమార్తె శ్రీలక్ష్మి వసుంధర భరతనాట్య ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. భరతనాట్యంలో బహిరంగ వేదికపై ఆమెకు ఇదే తొలి ప్రదర్శన. వల్లభనేని శ్రీలక్ష్మి వసుంధర అరంగేట్రంలోనే చక్కని ప్రతిభ చూపి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ కార్యక్రమం విజయవాడలో జరిగింది. 

ఈ కార్యక్రమానికి వల్లభనేని వంశీ మిత్రుడు, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సతీసమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడాలి నాని దంపతులను వల్లభనేని వంశీ దంపతులు వేదికపై సత్కరించారు. వల్లభనేని వంశీ కుమార్తె శ్రీలక్ష్మి వసుంధర ప్రఖ్యాత నాట్య కళాకారిణి డాక్టర్ భాగవతుల సౌమ్య వద్ద భరతనాట్యంలో శిక్షణ పొందింది.
Vallabhaneni Vamsi
Vallabhaneni Srilakshmi Vasundhara
Bharatanatyam
Vijayawada
YSRCP

More Telugu News