జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం... బస్సు లోయలో పడి 21 మంది మృతి
- 40 మంది వరకు గాయాలు
- జమ్మూ-పూంచ్ హైవేపై కాళీ ధర్ మందిర్ సమీపంలో లోయలో పడిన బస్సు
- కొనసాగుతున్న సహాయక చర్యలు
క్షతగాత్రులను అఖ్నూర్‌లోని స్థానిక ఆసుపత్రికి, జమ్మూలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు. హత్రాస్ నుంచి ప్రయాణికులను తీసుకువెళుతున్న బస్సు ప్రమాదానికి గురైందని... సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు ప్రకటించారు.
ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. అఖ్నూర్‌లో బస్సు ప్రమాదంలో చాలామంది ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించిందన్నారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ఎక్స్‌గ్రేసియా అందిస్తామని తెలిపారు.