Praja Bhavan: ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కేసులో... నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Police arrested accused in Praja Bhavan threat call
  • ప్రజాభవన్ పేలబోతుందంటూ నిన్న ఫోన్ చేసిన శివరామకృష్ణ
  • భవనాన్ని జల్లెడ పట్టి ఫేక్ కాల్‌గా గుర్తించిన పోలీసులు
  • నిందితుడు మద్యం మత్తులో ఫోన్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు
ప్రజాభవన్‌కు వచ్చిన బాంబు బెదిరింపు కేసులో పంజాగుట్ట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని.. కాసేపట్లో పేలబోతుందని నిన్న పోలీసులకు ఫోన్ చేశాడు. అప్రమత్తమైన పోలీసులు ప్రజాభవన్‌ను జల్లెడ పట్టారు. రెండు గంటలకు పైగా తనిఖీలు చేసి... ఫేక్ కాల్‌గా గుర్తించారు.

ఈరోజు నిందితుడు శివరామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం సేవించి కంట్రోల్ రూంకు ఫోన్ చేసినట్లు గుర్తించారు. శివరామకృష్ణ ముషీరాబాద్‌లో ఉంటున్నాడు. అతనిని గుంటూరు జిల్లా వాసిగా గుర్తించారు.
Praja Bhavan
Hyderabad
Police

More Telugu News