Chandrababu: శంషాబాద్‌ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘన స్వాగతం

Chandrababu Naidu Returns from Foreign
  • విశ్రాంతి కోసం ఈనెల 19న విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత‌
  • విదేశీ పర్యటన ముగించుకుని బుధ‌వారం ఉద‌యం స్వ‌దేశానికి వ‌చ్చిన‌ చంద్ర‌బాబు
  • భార్య‌ భువనేశ్వరితో క‌లిసి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని బుధ‌వారం ఉద‌యం శంషాబాద్ అంత‌ర్జాతీయ‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం అమెరికా వెళ్లిన చంద్రబాబు దాదాపు పది రోజుల పాటు అక్కడే గడిపారు. చంద్రబాబు రాక నేపథ్యంలో పార్టీ నేతలు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని ఘనంగా స్వాగతం పలికారు. 

కాగా, విశ్రాంతి కోసం ఈనెల 19న చంద్రబాబు విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక కౌటింగ్ సమయం దగ్గర పడుతుడంటంతో వీదేశీ పర్యటనలో ఉన్ననేతలు స్వదేశానికి పయనమయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు, ఆయన భార్య‌ భువనేశ్వరి విదేశీ పర్యటన ముగించుకుని శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు.  
Chandrababu
TDP
Andhra Pradesh
Hyderabad

More Telugu News