Babar Azam: అభిమానుల‌పై నోరుపారేసుకున్న పాక్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం.. వీడియో వైర‌ల్‌!

Babar Azam Scolds Fans in Cardiff Ahead of ENG vs PAK 3rd T20I 2024 Video Goes Viral
  • కార్డిఫ్‌లో బాబ‌ర్‌ను చుట్టుముట్టిన అభిమానులు
  • కోపంతో వారిపై నోరుపారేసుకున్న పాక్ కెప్టెన్ 
  • ఫ్యాన్స్‌ను అక్క‌డి నుంచి త‌రిమికొట్టాల్సిందిగా సెక్యూరిటీకి ఆదేశం
పాకిస్థాన్ జ‌ట్టు 4 మ్యాచుల టీ20 సిరీస్ కోసం ప్ర‌స్తుతం ఇంగ్లండ్‌లో ప‌ర్య‌టిస్తోంది. దీనిలో భాగంగా మూడో టీ20 కోసం పాక్ జ‌ట్టు కార్డిఫ్ వెళ్లింది. అయితే, కార్డిఫ్‌లో త‌న‌ను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన అభిమానులతో పాకిస్థాన్ కెప్టెన్ బాబ‌ర్ ఆజం దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు. త‌న‌ను చుట్టుముట్టిన ఫ్యాన్స్‌పై బాబ‌ర్ నోరుపారేసుకున్నాడు. 

ఇంత‌కుముందెన్న‌డూ చూడ‌ని విధంగా వారిపై విరుచుకుప‌డ్డాడు. ఏకంగా సెక్యూరిటీతో అభిమానుల‌ను అక్క‌డి నుంచి త‌రిమికొట్టాల్సిందిగా ఆదేశించిన‌ట్లు స‌మాచారం. ఎప్పుడూ కామ్‌గా క‌నిపించే బాబ‌ర్ ఆజం ఇలా కోపోద్రిక్తుడు కావ‌డం ఇదే తొలిసారి. 

కాగా, మంగ‌ళ‌వారం కార్డిఫ్ వేదిక‌గా ఇంగ్లండ్‌, పాక్ మ‌ధ్య మూడో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఇక ఇప్ప‌టికే నాలుగు మ్యాచుల టీ20 సిరీస్‌లో 1-0 తేడాతో ఆతిథ్య జ‌ట్టు ముందంజలో ఉంది.
Babar Azam
Cardiff
ENG vs PAK
3rd T20I
Cricket
Sports News

More Telugu News