Chandrababu: ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ కు చంద్రబాబు స్పందన

Chandrababu responds to PM Modi tweet on NTR birth anniversary
  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • సోషల్ మీడియాలో నివాళులు అర్పించిన ప్రధాని మోదీ
  • ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం కలిసి పనిచేద్దామని పిలుపు
  • తప్పకుండా కలిసి పనిచేద్దాం అంటూ చంద్రబాబు ట్వీట్
ఇవాళ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ఘన నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం కలిసి పనిచేస్తాం అంటూ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్ పై టీడీపీ అధినేత, ఎన్డీయే భాగస్వామ్య పక్ష నేత చంద్రబాబు స్పందించారు. 

"నిజంగా... ఎన్టీఆర్ గారు తెర మీద, తెర వెలుపల ఓ లెజెండ్. ప్రజా కేంద్రక పాలన, సంక్షేమం కోసం పోరాడేందుకు ఆయన ఓ ప్రేరణగా నిలుస్తారు. ఆయన నిస్వార్థ ప్రజాసేవ స్ఫూర్తి చిరస్థాయిగా మన హృదయాల్లో ఉండిపోతుంది, మన మార్గాలను ప్రకాశవంతం చేస్తుంది. ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం మనం తప్పకుండా కలిసి పనిచేద్దాం మోదీ గారూ!" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Narendra Modi
NTR
Birth Anniversary
TDP
BJP
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News