KKR: కోల్‌క‌తా సెల‌బ్రేష‌న్స్‌.. ర‌స్సెల్‌తో అన‌న్య పాండే డ్యాన్స్‌!

Andre Russell enjoying Lutt Putt Gaya Song with Ananya Panday during the IPL winning Party
  • బాలీవుడ్ ప్ర‌ముఖులు, కేకేఆర్ ఆట‌గాళ్లకు షారుఖ్ స్పెష‌ల్ డిన్న‌ర్ పార్టీ
  • 'డుంకీ' మూవీలోని 'లుట్ పుట్ గ‌యా' పాట‌కు చిందులేసిన అన‌న్య‌, ర‌స్సెల్‌
  • నెట్టింట వీడియో వైర‌ల్‌
చెన్నై వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ 2024 ఫైన‌ల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ విజయం సాధించి టైటిల్ గెలిచిన‌ విష‌యం తెలిసిందే. దీంతో 2012, 2014 త‌ర్వాత కేకేఆర్‌ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీని త‌న ఖాతాలో వేసుకుంది. ఇక టైటిల్ గెలిచిన త‌ర్వాత కోల్‌క‌తా సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. 

కాగా, కోల్‌క‌తా ఫ్రాంచైజీ య‌జ‌మాని షారుఖ్ ఖాన్ ఈ విన్నింగ్ సెల‌బ్రేష‌న్స్‌ను మ‌రింత ఘ‌నంగా జ‌రిపారు. ప్ర‌త్యేకంగా డిన్న‌ర్ ఏర్పాటు చేశారు. ఈ స్పెష‌ల్ డిన్న‌ర్‌లో బాలీవుడ్ ప్ర‌ముఖులు, కేకేఆర్ ఆట‌గాళ్లు చిందులేశారు. 

ఇందులో భాగంగా షారుఖ్ న‌టించిన 'డుంకీ' మూవీలోని 'లుట్ పుట్ గ‌యా' పాట‌కు ఆండ్రీ ర‌స్సెల్‌తో క‌లిసి బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే డ్యాన్స్ చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. కాగా, షారుఖ్ త‌న‌య సుహానా ఖాన్‌తో క‌లిసి కోల్‌క‌తాకు మ‌ద్ద‌తుగా ఆమె చాలా మ్యాచుల‌కు స్టేడియానికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.
KKR
IPL 2024
Andre Russell
Ananya Panday

More Telugu News