యెడ్యూరప్పపై లైంగిక దాడి ఆరోపణలు చేసిన మహిళ మృతి
- తన కుమార్తెతో కలిసి యెడ్యూరప్ప వద్దకు వెళ్లానన్న మహిళ
- తన కుమార్తెపై యెడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణ
- గత మార్చి నెలలో యెడ్యూరప్పపై పోక్సో కేసు నమోదు
- శ్వాస సంబంధ వ్యాధితో బాధపడుతూ మరణించిన మహిళ
అయితే, ఆయనపై ఆరోపణలు చేసిన మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆ మహిళ శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతోందని, ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసిందని పోలీసులు వెల్లడించారు. అయితే, ఆమె వాంగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.