IPL 2024: గౌతం గంభీర్‌కు ముద్దు పెట్టిన షారుఖ్.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

Shah Rukh Khan Hugs and Kisses Gautam Gambhir After KKR Win IPL 2024 Title
  • కేకేఆర్‌ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన మెంటార్ గంభీర్‌పై ప్ర‌శంస‌లు
  • నిన్న‌టి ఫైనల్ త‌ర్వాత గౌతీ నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్న షారుఖ్
  • 'డేర్ టూ డ్రీమ్' క్యాప్ష‌న్‌తో ఫొటోల‌ను షేర్ చేసిన‌ గంభీర్‌
  • గౌతీకి షారుఖ్ ముద్దు పెట్టిన వీడియోను వైర‌ల్ చేస్తున్న ఫ్యాన్స్‌  
2024 ఐపీఎల్ ఫైనల్లో సన్ రైజర్స్ ను చిత్తుగా ఓడించిన కోల్‌క‌తా నైట్ రైడర్స్ (కేకేఆర్‌) మూడోసారి టైటిల్ గెలిచింది. లీగ్ స్టేజ్ నుంచే అత్యుత్తమ ఆట తీరుతో అందర్నీ ఆకట్టుకున్న కేకేఆర్.. ఫైనల్లోనూ అదే ప్రదర్శన కనబర్చి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో దాదాపు ప‌దేళ్ల తర్వాత ట్రోఫీ నెగ్గడంతో కోల్‌క‌తా ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. 

ఇదిలాఉంటే.. నైట్ రైడ‌ర్స్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఆ జ‌ట్టు మెంటార్ గౌతం గంభీర్‌పై ప‌లువురు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. మొద‌టి నుంచి కేకేఆర్‌ను త‌న‌దైన‌శైలిలో ముందుకు న‌డిపాడంటూ గౌతీని మొచ్చుకుంటున్నారు. దాని ఫ‌లితంగా కేకేఆర్‌ ఇవాళ విజేత‌గా అవ‌త‌రించిందని కొనియాడుతున్నారు. అంత‌లా జట్టును గంభీర్ ప్ర‌భావితం చేశాడ‌ని తెగ పొగ‌డుతున్నారు. ఇన నిన్న‌టి ఫైన‌ల్ మ్యాచులో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌పై విజ‌యం త‌ర్వాత ఫ్రాంచైజీ కో-ఓన‌ర్ షారుఖ్ ఖాన్ జ‌ట్టు ఆట‌గాళ్లను, సిబ్బందిని అభినందించారు. 

ఈ క్ర‌మంలో మెంటార్ గౌతం గంభీర్ నుదుటిపై ముద్దు పెట్టి కౌగిలించుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోల‌ను గౌతీ త‌న అధికారిక ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 'డేర్ టూ డ్రీమ్' అనే క్యాప్ష‌న్‌ తో ఆయ‌న చేసిన ట్వీట్ ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మ‌రోవైపు గౌతీకి షారుఖ్ ముద్దు పెట్టిన వీడియోను అభిమానులు నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.
IPL 2024
Shah Rukh Khan
Gautam Gambhir
KKR
Sports News
Cricket

More Telugu News