IPL 2024: ఐపీఎల్ విజేత కోల్‌క‌తా డ్రెస్సింగ్ రూమ్‌ సెల‌బ్రేష‌న్స్ చూశారా?.. ఇదిగో వీడియో!

IPL 2024 Winner Kolkata Knight Riders Dressing Room Celebrations Till 2 AM
  • తెల్ల‌వారుజామున 2 గంట‌ల వ‌ర‌కు కేకేఆర్ ప్లేయ‌ర్ల‌ సెల‌బ్రేష‌న్స్
  • పంజాబీ మ్యూజిక్‌, షాంపైన్ షవర్‌తో కోల్‌క‌తా ఆట‌గాళ్ల‌ సంబ‌రాలు
  • సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్‌
టోర్నీ ఆద్యంతం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆ‌క‌ట్టుకున్న కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్‌) ఐపీఎల్ 2024 టైటిల్ విజేత‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. దీంతో కేకేఆర్ సంబరాలు అంబ‌రాన్నంటాయి. మ్యాచ్ అనంత‌రం డ్రెస్సింగ్ రూమ్‌లో కేక్ క‌ట్ చేసి విన్నింగ్ మూమెంట్స్‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు జ‌ట్టు స‌భ్యులు. తెల్ల‌వారుజామున 2 గంట‌ల వ‌ర‌కు ఈ సెల‌బ్రేష‌న్స్ జ‌రిగాయి. పంజాబీ మ్యూజిక్‌, షాంపైన్ షవర్‌తో కోల్‌క‌తా ప్లేయ‌ర్లు సంబ‌రాలు చేసుకున్నారు. ఈ సెల‌బ్రేష‌న్స్ తాలూకు వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. వీడియోలో సార‌ధి శ్రేయ‌స్ అయ్య‌ర్ ట్రోఫీతో డ్యాన్స్ చేయ‌డం చూడొచ్చు. అలాగే ఆట‌గాళ్లంద‌రూ కేక్ క‌ట్ చేసి ఎంజాయ్ చేయ‌డం వీడియోలో ఉంది. 

ఈ సంబ‌రాల‌కు ముందు వెంకటేశ్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, నితీష్ రానా, రింకూ సింగ్ అభిమానుల‌తో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అంత‌కుముందు ఐపీఎల్ ట్రోఫీతో పాటు ఫ్యామిలీ పిక్చర్ కోసం కేకేఆర్ జ‌ట్టు మెంటర్ గౌతమ్ గంభీర్ ఫొటోల‌కు పోజులిచ్చాడు. ఆ స‌మ‌యంలో గౌతీ ఇద్దరు కుమార్తెలు, భార్య అతనితో ఉన్నారు. ఈ ముగ్గురూ 'ఛాంపియన్స్ ఆఫ్ 2024' టీషర్టులు ధరించ‌డం క‌నిపించింది. ఇలా దాదాపు 45 నిమిషాల పాటు కొన‌సాగిన సెల‌బ్రేష‌న్స్ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ తలుపులు తెరుచుకున్నాయి. అక్క‌డ ఆట‌గాళ్లు తెల్ల‌వారుజామున 2 గంట‌ల వ‌ర‌కు సంబ‌రాలు చేసుకున్నారు. కేక్ క‌టింగ్ త‌ర్వాత ప్లేయ‌ర్లు పంజాబీ మ్యూజిక్‌పై డ్యాన్సుల‌తో హోరెత్తించారు. షాంపైన్ షవర్‌తో డ్రెస్సింగ్ రూమ్‌ను త‌డిపేశారు.
IPL 2024
Kolkata Knight Riders
Dressing Room Celebrations
Sports News
Cricket
KKR

More Telugu News