Google: ఫ్లిప్‌కార్ట్‌లో వాటాను కొనుగోలు చేయనున్న గూగుల్!

Google has proposed to invest in E commerce giant Flipkart
  • మైనర్ వాటా కొనుగోలుకు పెట్టుబడులు
  • ప్రతిపాదన చేసిన సెర్చింజన్ దిగ్గజం గూగుల్
  • గూగుల్ పెట్టుబడి వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందన్న ఫ్లిప్‌కార్ట్
వాల్‌మార్ట్ సారధ్యంలోని ఫ్లిప్‌కార్ట్‌లో మైనారిటీ వాటాను కొనుగోలు చేయాలని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ యోచిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తాజాగా చేపడుతున్న ఫండింగ్ రౌండ్‌లో పెట్టుబడులు పెట్టాలని గూగుల్ భావిస్తోంది. ఈ మేరకు గూగుల్ ప్రతిపాదన చేసినట్టు ఫ్లిప్‌కార్ట్ శుక్రవారం వెల్లడించింది. గూగుల్ పెట్టుబడుల ప్రతిపాదన ప్రస్తుతం నియంత్రణ సంస్థల పరిధిలో ఉందని, వేర్వేరు దశల ఆమోదాలు లభించాల్సి ఉందని పేర్కొంది. కాగా గూగుల్ ఎంత మొత్తంలో పెట్టుబడులకు ప్రతిపాదన చేసింది?, ఫ్లిప్‌కార్ట్ ఎంత మొత్తం నిధులు సమీకరించబోతోందనే విషయాలను వెల్లడించలేదు.

కాగా తాజా నిధుల సమీకరణలో భాగంగా గూగుల్‌ను మైనర్ వాటాదారుగా చేర్చుకోబోతున్నట్టుగా ఫ్లిప్‌కార్ట్ వివరణ ఇచ్చింది. గూగుల్ ప్రతిపాదనకు నియంత్రణ సంస్థల ఆమోదం లభించాల్సి ఉందని ఒక ప్రకటనలో తెలిపింది. పెట్టుబడితో పాటు ‘క్లౌడ్’ సహకారం కూడా అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని, ఫ్లిప్‌కార్ట్ వ్యాపార విస్తరణకు ఈ ఒప్పందం ఉపయోగపడనుందని పేర్కొంది. దేశవ్యాప్తంగా వినియోగదారులకు మరిన్ని సేవలు అందించేందుకు తమ డిజిటల్ సదుపాయలను ఆధునికీకరించుకునేందుకు అవకాశం దక్కనుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

కాగా తాజా రౌండ్‌లో ఫ్లిప్‌కార్ట్ సుమారు 350 మిలియన్ డాలర్ల మేర సమీకరించవచ్చుననే వార్తలు వెలువడుతున్నాయి. అయితే గూగుల్ ప్రతిపాదిత పెట్టుబడిపై ఎలాంటి సమాచారం తెలియరాలేదు.
Google
Flipkart
Business News

More Telugu News