Teacher: విద్యార్థితో కలసి సరదాగా టీచర్ డ్యాన్స్.. ఇన్ స్టా వీడియో వైరల్

Female Teacher Doing Couple Dance To Tum Hi Ho With Student Goes Viral
  • ఫేర్ వెల్ పార్టీ రోజున లవ్ సాంగ్ కు స్టెప్పులు
  • ఉత్సాహపరిచిన మిగిలిన విద్యార్థులు
  • వీడియోకు ఏకంగా 1.3 కోట్ల వ్యూస్, 10 వేలకుపైగా కామెంట్లు
ఫేర్ వెల్ పార్టీలో ఓ విద్యార్థితో కలసి స్కూల్ టీచర్ సరదాగా డ్యాన్స్ చేసిన వీడియో ఇన్ స్టా గ్రామ్ ను ఊపేస్తోంది. కుషల్ ఎంజే పేరుతో ఓ యూజర్ అప్ లోడ్ చేసిన ఈ వీడియోకు ఇప్పటివరకు ఏకంగా 1.3 కోట్లకుపైగా వ్యూస్, 10 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి.

ఆ వీడియోలో చీరకట్టులో ఉన్న ఓ టీచర్ తన విద్యార్థితో కలసి బాలీవుడ్ చిత్రం ఆషికీ–2లోని ‘తుమ్ హి హో’ పాటకు డ్యాన్స్ చేయడం కనిపించింది. వారు డ్యాన్స్ చేస్తుండగా పక్కనున్న విద్యార్థులు తమ అరుపులు, కేకలతో మరింతగా ఉత్సాహపరిచారు. తరగతి గదిని అందంగా ముస్తాబు చేయగా బ్లాక్ బోర్డ్ పై ఫేర్ వెల్ సందేశాలు కూడా వీడియోలో కనిపించాయి.

ఈ వీడియో చూసిన చాలా మంది ఆ విద్యార్థిని అదృష్టవంతుడిగా అభివర్ణించారు. అతను నా కలను అనుభూతి చెందుతున్నాడని ఓ యూజర్ కామెంట్ చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ టీచర్ తో డ్యాన్స్ చేయాలన్న కల కలగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకో యూజరేమో ‘నా స్కూల్ ఇలా ఎందుకు లేదు సోదరా?’ అని ప్రశ్నించాడు. ఇంకొకరేమో ఆ టీచర్ కచ్చితంగా ఇంగ్లిష్ మేడం అయ్యుంటుందన్నాడు.
Teacher
Student
Dance
Viral
Video
Instagram
Netizens
Amused

More Telugu News