స్వాతి మాలివాల్‌పై దాడి కేసు మీద తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానన్న కేజ్రీవాల్
- న్యాయం జరగాలని వ్యాఖ్య
- ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయన్న కేజ్రీవాల్
- నిష్పక్షపాత విచారణ జరిగినప్పుడే సరైన న్యాయం అందుతుందన్న ఢిల్లీ సీఎం
కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌తో బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బిభవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని ముంబైకి తీసుకువెళ్లారు. నిందితుడి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.