రాంచీ వీధుల్లో బైక్ పై చక్కర్లు కొట్టిన ధోనీ.. వీడియో ఇదిగో!
- ఐపీఎల్ లో ప్లేఆఫ్స్ కు చేరని సీఎస్కే
- కీలక మ్యాచ్ లో క్యాచ్ ఔట్ అయిన ధోనీ
- రాంచీ వెళ్లిపోయిన టీమిండియా మాజీ సారథి
ఓవైపు ఐపీఎల్ కు ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కొందరు, వచ్చే ఏడాది కూడా ఆడతాడని మరికొందరు సోషల్ మీడియ వేదికలపై చర్చించుకుంటుండగా.. మిస్టర్ కూల్ మాత్రం కూల్ గా తన బైక్ తో రాంచీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. రిటైర్మెంట్ పై ధోనీ స్పందించలేదు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో సీఎస్కే ఓటమి తర్వాత ధోనీ రాంచీలోని తన నివాసానికి చేరుకున్నాడు. తాజాగా తన బైక్ తో ధోనీ చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.