Andhra Pradesh: ఏపీలో బదిలీ అయిన వారి స్థానంలో కొత్త పోలీసు అధికారులను నియమించిన ఈసీ

EC appoints new police officials
  • ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు
  • పలువురు పోలీసు అధికారులపై ఈసీ వేటు
  • తాజాగా ఐదుగురిని డీఎస్పీలుగా, ఏడుగురిని ఇన్ స్పెక్టర్లుగా నియామకం
ఏపీలో ఎన్నికల నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరగ్గా, పలువురు పోలీసు అధికారులను ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయిన వారి స్థానంలో ఈసీ నేడు కొత్త నియామకాలు చేపట్టింది. డీఎస్పీలుగా ఐదుగురిని, ఇన్ స్పెక్టర్లుగా ఏడుగురిని నియమిస్తూ ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేశ్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 

గురజాల డీఎస్పీగా సీహెచ్ శ్రీనివాసరావు, నరసరావుపేట డీఎస్పీగా ఎం సుధాకర్ రావు, తాడిపత్రి డీఎస్పీగా జనార్దన్ నాయుడు, తిరుపతి డీఎస్పీగా రవి మనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా వెంకటాద్రిని నియమించారు.
Andhra Pradesh
Police
EC
AP CEO

More Telugu News