T20 World Cup 2024: టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల‌.. భార‌త్‌కు ఒకే ఒక‌ వార్మ‌ప్ మ్యాచ్‌

ICC T20 World Cup 2024 Warm Up Matches Schedule Announced
  • ఈ నెల 27వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు వార్మ‌ప్ మ్యాచులు 
  • అమెరికా, ట్రినిడాడ్ అండ్ టోబాగో వేదిక‌ల్లో మ్యాచ్‌లు ఉంటాయన్న‌ ఐసీసీ 
  • జూన్ 1న బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌

2024 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు సర్వం సిద్ధ‌మైంది. జూన్ 1వ‌ తేదీ నుంచి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఐసీసీ వార్మ‌ప్ మ్యాచుల షెడ్యూల్ విడుద‌ల చేసింది. దీనిలో భాగంగా జూన్ 1వ తేదీన‌ బంగ్లాదేశ్‌తో టీమిండియా వార్మ‌ప్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌నున్నట్లు ఐసీసీ ప్ర‌క‌టించింది. అయితే ఆ మ్యాచ్‌కు వేదిక‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలిపింది. 

ఇక ఈ టోర్నీలో మొత్తం 20 జ‌ట్లు, 5 గ్రూపులుగా విడిపోయి త‌ల‌ప‌డ‌నున్నాయి. ఇందులో 17 జ‌ట్లు వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌నున్నాయి. ఆ మ్యాచ్‌లు ఈ నెల 27వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్నాయి. అమెరికా, ట్రినిడాడ్ అండ్ టోబాగో వేదిక‌ల్లో మ్యాచ్‌లు ఉంటాయని ఐసీసీ వెల్ల‌డించింది. 

టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రైర‌రీ క్రికెట్ స్టేడియం, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ స్టేడియం, క్వీన్స్ పార్క్ ఓవ‌ల్‌, ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడ‌మీలో 16 వార్మ‌ప్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. క్వీన్స్ పార్క్ ఓవ‌ర్‌ల్‌ లో వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా మ‌ధ్య మే 30వ తేదీన జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌ కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించరు.

డిఫెండింగ్ చాంపియ‌న్ ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, న్యూజిలాండ్ జ‌ట్లు మాత్రం వార్మ‌ప్ మ్యాచ్‌లు ఆడ‌వు. ఇంగ్లండ్‌, పాకిస్థాన్ మ‌ధ్య ఈ నెల‌ 22వ తేదీ నుంచి నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జ‌ర‌గ‌నుంది. ఇక న్యూజిలాండ్ త‌న తొలి మ్యాచ్‌ను జూన్ 8వ తేదీన ఆఫ్గ‌నిస్థాన్‌తో ఆడ‌నుంది.

  • Loading...

More Telugu News