YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణ మళ్లీ వాయిదా

YS Viveka Murder Case Adjourned Again
  • కోర్టుకు హాజరైన అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి
  • చంచల్ గూడ జైలులో నలుగురు నిందితులు
  • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపర్చిన అధికారులు

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. శుక్రవారం ఉదయం కోర్టు విచారణ చేపట్టగా.. నిందితులుగా ఉన్న ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో పాటు మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి ప్రస్తుతం జైలులో ఉన్న నలుగురు నిందితులను కూడా అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మాత్రం కోర్టుకు రాలేదు. కాగా, ఈ కేసు విచారణను వచ్చే నెల (జూన్) 11న చేపడతామని వెల్లడిస్తూ కోర్టు మరోసారి వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News