ఆ నోట్ల గుట్టలను పేదలకు పంచే మార్గం వెతుకుతున్నాం: ప్రధాని మోదీ
- ఈడీ సీజ్ చేసిన సొమ్ముపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- పేదల నుంచి దోచుకున్న సొమ్ము తిరిగి పేదలకే చేరాలి
- ఇందుకోసం న్యాయ బృందం సలహా కోరతామన్న మోదీ
దీనిపై న్యాయ బృందం సలహా కోరతామని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని వెల్లడించారు. కేంద్ర దర్యాఫ్తు సంస్థలను ఎన్డీయే సర్కారు దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలపై స్పందిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హయాంలో నిరుపయోగంగా మారిన ఈడీకి తమ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిచ్చిందని చెప్పారు. దీంతో ప్రస్తుతం కేంద్ర దర్యాఫ్తు సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని వివరించారు.