మధ్యాహ్నం 12 గంటలకు ఐప్యాక్ ఆఫీస్‌కు సీఎం జగన్
- విజయవాడ, బెంజి సర్కిల్‌లోని కార్యాలయానికి వెళ్లనున్న సీఎం
- సంస్థ ప్రతినిధులతో దాదాపు అరగంట ముచ్చట
- ఎన్నికల అనంతరం తొలిసారి బయటకు వస్తున్న వైసీపీ అధినేత
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ కోసం కృషి చేసిన బృందానికి ఆయన కృతజ్ఞతలు చెప్పనున్నారు. బృంద సభ్యులకు కొన్ని బహుమతులను కూడా అందజేయనున్నారని సమాచారం. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి చేరుకొని దాదాపు 30 నిమిషాలపాటు వారితో జగన్ మాట్లాడనున్నారు.