uscis: లేఆఫ్ లేదా ఉద్వాసన ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు మార్గదర్శకాలు జారీ చేసిన యూఎస్ సీఐఎస్

USCIS issues guidelines for H1B visa holders laid off or facing termination
  • అమెరికాను వదిలి వెళ్లక తప్పదనుకుంటున్న టెకీలకు గుడ్ న్యూస్ చెప్పిన ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ
  • అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని సూచన
  • ప్రస్తుత వీసా స్టేటస్ ను మార్చుకోవడం ద్వారా అదనపు గడువు పొందొచ్చని వెల్లడి
అమెరికాలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తుండటంతో దిగ్గజ కంపెనీలన్నీ ఖర్చుల తగ్గింపుపై దృష్టి పెట్టాయి. భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, టెస్లా, వాల్ మార్ట్ వంటి మల్టీ నేషనల్ కంపెనీలు ఉద్యోగులను తొలగించడమో లేదా లేఆఫ్ లు ప్రకటించడమో చేశాయి. దీంతో తమకు స్వదేశం వెళ్లడం తప్ప వేరే మార్గం లేదని భావిస్తున్న హెచ్ 1బీ వీసా టెకీలకు అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ (యూఎస్ సీఐఎస్) గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలు ఏమిటో తెలియజేస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ఉపయోగించుకోవడం ద్వారా 60 రోజుల గ్రేస్ పీరియడ్ తర్వాత కూడా వారు అమెరికాలో ఉండేందుకు అవకాశం లభించనుంది.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు ఉన్న అవకాశాలు..

– నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ మార్పు కోసం దరఖాస్తును ఫైల్ చేసుకోవడం
– స్టేటస్ లో మార్పు కోరుతూ దరఖాస్తు సమర్పించడం
– బలవంతపు పరిస్థితుల ఉపాధి అధికార పత్రం కోసం దరఖాస్తు చేసుకోవడం
– కంపెనీ మారేందుకు పిటిషన్ దాఖలు చేసి లబ్ధి పొందడం.

6‌‌‌‌0 రోజుల గ్రేస్ పీరియడ్‌లోగా ఈ చర్యల్లో ఏదైనా ఒక దాన్ని ఎంపిక చేసుకోవాలి. తద్వారా హెచ్1బీ వీసాదారులు నాన్ ఇమ్మిగ్రెంట్ స్టేటస్ కోల్పోయినప్పటికీ అధికారికంగా అమెరికాలో మరికొంత కాలం ఉండే అవకాశం పొందుతారు.

అలాగే అర్హతగల H-1B నాన్ ఇమ్మిగ్రెంట్ లు కొత్త H-1B పిటిషన్ దాఖలు చేసిన వెంటనే వేరే కంపెనీలో పనిచేయొచ్చు. అలాగే 180 రోజుల స్టేటస్ పెండింగ్ గడువు తర్వాత వారి స్టేటస్ అప్లికేషన్ ను కొత్త కంపెనీ ఉద్యోగ ఆఫర్ కింద సర్దుబాటు చేసుకోవచ్చు.

అలాగే ప్రస్తుత స్టేటస్ ను డిపెండెంట్ లేదా స్టూడెంట్ లేదా విజిటర్ స్టేటస్ కిందకు మార్చుకోవచ్చు. దీనివల్ల దరఖాస్తుపై నిర్ణయం వెలువడే వరకు చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్నట్లుగా పరిగణించడాన్ని ఆపొచ్చు.

సెల్ఫ్-పిటిషన్డ్ ఇమ్మిగ్రెంట్ వీసా పిటిషన్లు వేసే అర్హత ఉన్న ఉద్యోగులు స్టేటస్ అప్లికేషన్ సర్దుబాటుతోపాటే ఈ పిటిషన్ ను కూడా ఏకకాలంలో ఫైల్ చేయవచ్చు. దీనివల్ల అలాంటి ఉద్యోగులు అమెరికాలో ఉండేందుకు, ఏడాదిపాటు ఈఏడీని పొందేందుకు వీలవుతుంది.
uscis
H1B Visa
USA
layoff
termination
job holders
guidelines

More Telugu News