Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చింది: హరీశ్ రావు

Harish Rao blames congress government for power cuts
  • కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించడం లేదని వ్యాఖ్య
  • ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని ఖండించిన హరీశ్ రావు
  • ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామని వ్యాఖ్య

ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించలేదన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్‌ను సరఫరా చేసిందన్నారు. ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను నిర్మించామన్నారు. కరెంట్ కోతలు సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదన్నారు.

  • Loading...

More Telugu News