Kollu Ravindra: నా గెలుపు కోసం కృషి చేసిన ఎన్నారై మృతి చెందడం కలచివేస్తోంది: కొల్లు రవీంద్ర

I am very disturbed with the death of NRI who worked for my win says Kollu Ravindra
  • టీడీపీ నేతలు, కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదన్న కొల్లు రవీంద్ర
  • వైసీపీ దాడులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పని చేశారని కితాబు
  • ఓటమిని పేర్ని నాని వర్గం ముందే గ్రహించిందని వ్యాఖ్య
టీడీపీ నేతలు, కార్యకర్తల రుణం తీర్చుకోలేనిదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ అరాచకాలు, దాడులను ఎదుర్కొంటూ.... ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్టీ కోసమే పని చేశారని కితాబిచ్చారు. పేర్ని నాని మీద ఉన్న వ్యతిరేకతే ప్రజలను పోలింగ్ బూత్ లకు తరలి వచ్చేలా చేసిందని అన్నారు. పేర్ని నాని వర్గం ఓటమిని ముందే గ్రహించిందని... దీంతో, ఉదయం నుంచే రెచ్చగొట్టే కార్యక్రమాలకు, కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని మండిపడ్డారు. 

ఓవైపు గంజాయి బ్యాచ్ తో దాడులు చేయించారని... మరోవైపు ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారని... అయినా వారి కుట్రలకు టీడీపీ కార్యకర్తలు తలొగ్గలేదని కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ దాడుల్లో గాయపడినా, ఆ గాయాలతోనే పార్టీ విజయానికి కృషి చేశారని కొనియాడారు. తన గెలుపు కోసం కృషి చేసిన ఎన్నారై గుండెపోటుతో మృతి చెందడం కలచివేసిందని అన్నారు. వారి రుణం తీర్చుకోలేదని చెప్పారు.
Kollu Ravindra
Telugudesam
Perni Nani
YSRCP

More Telugu News