Pulivarti Nani: పులివర్తి నాని అన్నతో మాట్లాడాను... ఈ దాడి దిగ్భ్రాంతికి గురిచేసింది: నారా లోకేశ్

Nara Lokesh condemns attack on Pulivarti Nani in Tirupati
  • చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై తిరుపతిలో దాడి
  • ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు  నారా లోకేశ్ ప్రకటన
  • వైసీపీ మూకలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్

తిరుపతిలో టీడీపీ నేత పులివర్తి నానిపై జరిగిన దాడి పార్టీ అగ్ర నాయకత్వాన్ని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. 

చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ మూక దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామ్య ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓటములు సహజం అని తెలిపారు. కానీ, అపజయం తప్పదనే సంకేతాలతో వైసీపీ తన ఫ్యాక్షన్ విషసంస్కృతికి తెరలేపిందని లోకేశ్ విమర్శించారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ను పరిశీలించేందుకు వచ్చిన పులివర్తి నానిపై వైసీపీ మూక దాడి దిగ్భ్రాంతికి గురిచేసిందని పేర్కొన్నారు. 

ఈ ఘటనపై పులివర్తి నాని అన్నతో మాట్లాడానని, గాయపడిని వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించానని లోకేశ్ వెల్లడించారు. పోలీసులు వైసీపీ మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నానని తెలిపారు.

  • Loading...

More Telugu News