KTR: ఆ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్టపడ్డారు: కేటీఆర్

  • ఆరేడు లోక్ సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందని విమర్శ
  • ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలుగా కాంగ్రెస్, బీజేపీ రాజకీయం కనిపిస్తోందని ఆగ్రహం
  • 17 లోక్ సభ స్థానాలకు గాను దాదాపు ఆరేడు స్థానాల్లో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టిందని వ్యాఖ్య
  • కరీంనగర్, నిజమాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరిలలో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్న కేటీఆర్
KTR blames Revanth Reddy is trying to BJP win

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ ఎవరో తెలియదని, సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి చివరి పది రోజుల వరకు కనీసం ప్రచారం చేయలేదని, మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి ఆ ప్రాంతం వారికి సుపరిచితులు కాదన్నారు. నిజామాబాద్ అభ్యర్థి జీవన్ రెడ్డి సీనియర్ నాయకుడే అయినప్పటికీ ఆయనను ఒత్తిడి చేసి పోటీ చేయించారని విమర్శించారు. జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి పోటీ చేయాలనుకుంటే, ఆయనకు ఇష్టంలేని సీటు ఇచ్చారన్నారు.

ఆరేడు లోక్ సభ నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా బీజేపీ వారిని గెలిపించేందుకు కిషన్ రెడ్డి కంటే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా కష్టపడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం చూస్తుంటే ఢిల్లీలో కుస్తీలు, గల్లీలో దోస్తీలు కడుతున్నాయన్నారు. 17 లోక్ సభ స్థానాలకు గాను దాదాపు ఆరేడు స్థానాల్లో కాంగ్రెస్ బలహీనమైన... డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు. కరీంనగర్, నిజమాబాద్, సికింద్రాబాద్ సహా వివిధ నియోజకవర్గాల్లో డమ్మీ అభ్యర్థులను నిలబెట్టిందన్నారు.

  • Loading...

More Telugu News