Chaitanya Rao: 'ఆహా' వేదికపైకి 'షరతులు వర్తిస్తాయి' సినిమా!

Sharathulu Varthisthayi OTT Release DateConfirmed
  • చైతన్యరావు హీరోగా 'షరతులు వర్తిస్తాయి'
  • ఆయన సరసన నటించిన భూమి శెట్టి
  • మార్చి 15న థియేటర్లకు వచ్చిన సినిమా 
  • ఈ నెల 18వ తేదీన సినిమా విడుదల

'ఆహా' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి చకచకా కొత్త సినిమాలు వస్తున్నాయి. రీసెంటుగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా ఈ ఫ్లాట్ ఫామ్ ద్వారానే పలకరించింది. ఇక ఇప్పుడు మరో సినిమా ఈ వేదికపైకి రానుంది. ఆ సినిమా పేరే 'షరతులు వర్తిస్తాయి'. చైతన్యరావు - భూమి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాకి కుమారస్వామి దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా మార్చి 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ సినిమాకి పెద్దగా పబ్లిసిటీ లేదు. అందుకు తగినట్టుగానే, ఆడియన్స్ నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.  శ్రీలత - సామల నాగార్జున నిర్మించిన ఈ సినిమాకి, అరుణ్ చిలువేరు సంగీతాన్ని అందించాడు. అలాంటి ఈ సినిమా ఈ నెల 18వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమాలో కథానాయకుడు ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటాడు. తన కుటుంబానికి ఆ ఉద్యోగమే ఆధారం. హీరోయిన్ తో అతను రిలేషన్ షిప్ లో ఉంటాడు. తాపీగా జీవితం సాగిపోతుందని అనుకుంటున్న తరుణంలో, మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసం బారిన పడతాడు. అందులో నుంచి ఎలా బయటపడతాడు అనేదే కథ.
Chaitanya Rao
Bhumi Shety
Kumara Swami

More Telugu News