Jagan: విదేశాలకు వెళ్లేందుకు సీఎం జగన్ కు సీబీఐ కోర్టు అనుమతి

CBI Court gives nod to CM Jagan to go aborad
  • అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడిగా వైఎస్ జగన్
  • విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి
  • ఆ మేరకు బెయిల్ షరతులు
  • ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశాల్లో సీఎం జగన్ కుటుంబం విహారయాత్ర
  • అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో దరఖాస్తు చేసుకున్న సీఎం జగన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు పచ్చజెండా ఊపింది. కుటుంబ సభ్యులతో కలిసి బ్రిటన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించేందుకు సీఎం జగన్ చేసుకున్న విజ్ఞాపనను నాంపల్లి సీబీఐ కోర్టు మన్నించింది. ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతించింది. 

విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ సీఎం జగన్ కొన్ని రోజుల కిందటే సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ నిబంధనలు సడలించాలని కోర్టును కోరారు. 

అయితే, అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోందని, జగన్ ప్రధాన నిందితుడిగా ఉన్నారని, ఆయనకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. జగన్ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగించిన సీబీఐ కోర్టు... జగన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.

  • Loading...

More Telugu News