YS Jagan: పద్మవ్యూహంలో బలవ్వడానికి ఇక్కడున్నది అభిమన్యుడు కాదు... అర్జునుడు: సీఎం జగన్ ట్వీట్

YS Jagan says YCP will be the winner in election war
  • ఏపీలో మే 13న పోలింగ్
  • ఎన్నికల మహా సంగ్రామంలో విజయం మనదే అంటూ సీఎం జగన్ ధీమా
  • కృష్ణుడి వంటి ప్రజలు తన వెంట ఉన్నారంటూ ట్వీట్

ఏపీ సీఎం జగన్ ఎల్లుండి (మే 13) పోలింగ్ నేపథ్యంలో తన సమర సన్నద్ధతను చాటారు. తనను తాను అర్జునుడిగా అభివర్ణించుకున్నారు. ఎన్నికల మహా సంగ్రామంలో పచ్చ మంద పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు... అర్జునుడు అని స్పష్టం చేశారు. ఈ అర్జునుడికి కృష్ణుడి వంటి నా ప్రజలు తోడుగా ఉన్నారు... ఈ యుద్ధంలో విజయం మనదే అని ఉద్ఘాటించారు. 

"వారి వ్యూహాల్లో, వారి కుట్రల్లో, వారి కుతంత్రాల్లో, మోసపూరిత వాగ్దానాల్లో... వెన్నుపోట్లు, పొత్తులు, ఎత్తులు, జిత్తుల పద్మవ్యూహం కనిపిస్తోంది. కానీ, ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు... ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి ప్రజల అండ, దేవుడి దయ తోడుగా ఉన్నాయి. అందుకే మీ బిడ్డ ఇలాంటి పద్మవ్యూహాలకు భయపడడు. మీ అండదండలు ఉన్నంతకాలం మీ బిడ్డ తొణకడు" అంటూ ఓ సభలో చేసిన వ్యాఖ్యల వీడియోను కూడా సీఎం జగన్ పంచుకున్నారు.

  • Loading...

More Telugu News