Rain: ఐపీఎల్: కోల్ కతా, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి

Rain delayed toss match between KKR and MI
  • ఐపీఎల్ లో నేడు కేకేఆర్ × ముంబయి ఇండియన్స్
  • కోల్ కతాలో వర్షం
  • ఇంకా టాస్ వేయని అంపైర్లు  

ఐపీఎల్ లో నేడు కోల్ కతా నైట్ రైడర్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా నిలుస్తోంది. అయితే, కోల్ కతాలో వర్షం పడుతుండడంతో మ్యాచ్ ఇంతవరకు ప్రారంభం కాలేదు. కనీసం టాస్ కూడా వేయలేదు. ప్రస్తుతం వర్షం తగ్గినప్పటికీ, మ్యాచ్ ప్రారంభం కావడానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. 

కాగా, ఐపీఎల్ తాజా సీజన్ లో అదరగొడుతున్న కోల్ కతా నైట్ రైడర్స్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా కొనసాగుతోంది. టోర్నీలో ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్ లు ఆడి 8 విజయాలు నమోదు చేసింది. మరోవైపు ముంబయి ఇండియన్స్ 12 మ్యాచ్ ల్లో 8 ఓటములతో ప్లే ఆఫ్ రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది.

  • Loading...

More Telugu News