Aravind Krishna: జీ 5లో స్ట్రీమింగ్ అవుతున్న క్రైమ్ థ్రిల్లర్!

SIT Movie Update
  • అరవింద్ కృష్ణ హీరోగా రూపొందిన S.I.T 
  • ఓ యువతి మర్డర్ మిస్టరీ చుట్టూ తిరిగే కథ
  • కథానాయికగా అలరించనున్న నటాషా దోషి 
  • ఈ నెల 10 నుంచి జరుగుతున్న స్ట్రీమింగ్

ఓ మర్డర్ .. ఆ మర్డర్ చుట్టూ అనేక సందేహాలు .. పోలీస్ విచారణ .. ఈ నేపథ్యంలో చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లే .. ట్రీట్మెంట్ ఈ తరహా సినిమాలకు ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతూ ఉంటాయి. అలాంటి ఒక కథతో రూపొందిన సినిమానే 'S.I.T'. అరవింద్ కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమాకి, విజయ్ భాస్కర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమా ఇప్పుడు జీ 5లో ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.  S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఒక యువతి మర్డర్ కేసును ఛేదించడానికి రంగంలోకి దిగుతుంది. ఆ యువతి ఎవరు? ఆ హత్య చేసినదెవరు? ఆ కేసు విచారణలో పోలీస్ టీమ్ కి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేది కథ. 

నాగిరెడ్డి - తేజ్ పల్లి - శ్రీనివాస రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. నటాషా దోషి కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ఇతర ముఖ్యమైన పాత్రలను రుచిత సాధినేని .. రజత్ రాఘవ .. అనుక్ రాథోడ్ .. కౌశిక్ కనిపించనున్నారు. వరికుప్పల యాదగిరి ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా చెబుతున్నారు. 

  • Loading...

More Telugu News