Botsa Satyanarayana: చంద్రబాబు కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు: బొత్స సత్యనారాయణ

5 members of Chandrababu family contesting in elections says Botsa Satyanarayana
  • ఓటమి భయంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయిందన్న బొత్స
  • లోకేశ్ అడ్డదారుల్లో పదవులు పొందారని విమర్శ
  • జగన్ టార్గెట్ 175కి 175
ఎన్నికల్లో టీడీపీ కూటమి ఓడిపోతోందనే భయం, అసహనం చంద్రబాబులో పెరిగిపోతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు హామీల్లో ఒరిజినాలిటీ లేదని... తమ పథకాలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పేదలకు పథకాలు అందకుండా చేసి రాక్షసానందం పొందుతున్నారని చెప్పారు. 

తమది కుటుంబ పాలన అంటున్నారని... చంద్రబాబు కుటుంబం నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారని బొత్స అన్నారు. సీఎం జగన్ ను విమర్శించేంత స్థాయి నారా లోకేశ్ కు లేదని.. అడ్డ దారిలో పదవులు పొందిన వ్యక్తి నారా లోకేశ్ అని ఎద్దేవా చేశారు. సీఎం గురించి ఒక శుంఠ నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు... తాను ప్రధాని గురించి మాట్లాడితే తప్పేముందని ప్రశ్నించారు. సర్వేలను తాను నమ్మనని చెప్పారు. తమ అధినేత జగన్ టార్గెట్ 175కి 175 అని అన్నారు. తాను గెలిస్తే చాలని పవన్ కల్యాణ్ అనుకుంటున్నారని చెప్పారు. 

Botsa Satyanarayana
YSRCP
Jagan
Chandrababu
Nara Lokesh
Telugudesam

More Telugu News