Congress: జనసేన తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్‌గౌడ్ రాజీనామా

Janasena Telangana Leader Lakshman Goud Quits And Joins Congress
  • కాంగ్రెస్‌లోకి కొనసాగుతున్న వలసలు
  • రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక
  • పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పవన్‌కు లక్ష్మణ్‌గౌడ్ లేఖ
తెలంగాణలో కాంగ్రెస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు బీఆర్ఎస్ సహా పలు పార్టీల నేతలు కాంగ్రెస్‌లో చేరగా, తాజాగా జనసేన కూడా ఆ జాబితాలో చేరింది. ఆ పార్టీ తెలంగాణ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగ లక్ష్మణ్‌గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

నిన్న హోటల్ తాజ్‌కృష్ణలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు లక్ష్మణ్‌గౌడ్ జనసేన పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్‌కు లేఖ రాశారు.
Congress
Janasena
Telangana
Lakshman Goud Vanga

More Telugu News