నాకు ఏ పదవుల మీద ఆశ లేదు.. నా తెలంగాణ బాగుంటే చాలు: మంత్రి కోమటిరెడ్డి
- సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి ప్రశంసలు
- కేసీఆర్‌లా రేవంత్ దొంగ ఉద్యమకారుడు కాదంటూ చురకలు
- తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమకారుడినన్న కోమటిరెడ్డి
ఇక తనకు ఏ పదవుల మీద ఆశ లేదని, తెలంగాణ బాగుంటే చాలన్నారు. ఏనాడు పదవుల కోసం పాకులాడలేదని తెలిపారు. తనకు ఏ పదవి వద్దన్నారు. ప్రజల సమస్యలు తీర్చినప్పుడు కలిగే ఆనందం.. ఏ పదవిలోనో లేదు.. రాదని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. తెలంగాణ కోసం పదవిని తృణప్రాయంగా వదిలేసిన ఉద్యమకారుడ్ని అని అన్నారు.