సాయిపల్లవి బర్త్ డే స్పెషల్ వీడియోను రిలీజ్ చేసిన 'తండేల్' టీమ్!
- సాయిపల్లవి తాజా చిత్రంగా 'తండేల్'
- సముద్రం నేపథ్యంలో నడిచే కథ
- ఈ రోజున ఆమె పుట్టినరోజు
- ఆకట్టుకుంటున్న స్పెషల్ వీడియో
సాయిపల్లవి తన సినిమాలకి సంబంధించిన కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. తనకి నచ్చకపోతే పారితోషికం ఎంత ఇస్తామని చెప్పినా ఆమె చేయదు. ఆమెలోని ఈ వ్యక్తిత్వమే ఆమెకి మరింత అభిమానులను తెచ్చిపెట్టింది. అలాంటి సాయిపల్లవి పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా 'తండేల్' సినిమా టీమ్ ఆమెకి విషెస్ చెబుతూ, ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేసింది.
చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా 'తండేల్' సినిమా రూపొందుతోంది. సముద్రం . జాలరులు జీవితాల నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. సాయిపల్లవి గతంలో చేసిన సినిమాల తాలూకు క్లిప్స్ ను జోడిస్తూ, 'తండేల్' మేకింగ్ షాట్స్ తో రూపొందించిన ఈ వీడియో ఆమె అభిమానులను ఆకట్టుకునేలా ఉంది.