లక్నో సూపర్ జెయింట్స్ పై టాస్ ఓడిన సన్ రైజర్స్... ఇవాళ గెలిస్తే మూడో ప్లేస్

SRH loses toss against LSG in Hyderabad
  • ఐపీఎల్ లో ఇవాళ సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో
  • టోర్నీలో సన్ రైజర్స్ ఛేజింగ్ రికార్డు పేలవం
  • నేడు ఎలా ఆడుతుందోనని ఆందోళనలో అభిమానులు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ సొంతగడ్డపై లక్నో సూపర్ జెయింట్స్ ను ఎదుర్కొంటోంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన లక్నో జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో సన్ రైజర్స్ ఛేజింగ్ రికార్డు ఏమంత బాగా లేదన్న సంగతి తెలిసిందే. మరి ఇవాళ ఛేజింగ్ ఎలా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. 

ఈ మ్యాచ్ లో గెలిస్తే సన్ రైజర్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుతుంది. అదే జరిగితే, ప్లేఆఫ్ బెర్తు దాదాపు ఖాయమైనట్టే. టోర్నీలో ఇప్పటివరకు సన్ రైజర్స్ 11 మ్యాచ్ లు ఆడి 6 విజయాలు సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు నాలుగో స్థానంలో ఉంది. 

కాగా, ఇవాళ సన్ రైజర్స్ సారథి పాట్ కమిన్స్ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. బౌలింగ్ లోనే కాదు, బ్యాటింగ్ లోనూ మెరుపులు మెరిపించే సత్తా కమిన్స్ సొంతం. మరి బర్త్ డే నాడు కమిన్స్ నుంచి స్ఫూర్తిదాయక ప్రదర్శన రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Advertisement
SRH
LSG
Hyderabad
Pat Cummins

More Telugu News