Delhi Capitals: అదరగొట్టిన మెక్ గుర్క్, పోరెల్... స్టబ్స్ మెరుపులు... ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు

Delhi Capitals registers huge total against Rajasthan Royals
  • రాజస్థాన్ రాయల్స్ × ఢిల్లీ క్యాపిటల్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
  • 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసిన ఢిల్లీ

ఐపీఎల్ తాజా సీజన్ లో ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్ లో అదరగొట్టింది. ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 221 పరుగులు చేసింది. 

ఓపెనర్లు జేక్ ఫ్రేజర్ మెక్ గుర్క్, అభిషేక్ పోరెల్ అర్ధసెంచరీలతో అదరగొట్టగా... ఆఖర్లో ట్రిస్టాన్ స్టబ్స్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మెక్ గుర్క్, పోరెల్ జోడీ తొలి వికెట్ కు 60 పరుగులు జోడించి శుభారంభం అందించింది. మెక్ గుర్క్ 20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు చేయగా, పోరెల్ 36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 65 పరుగులు చేశాడు. 

షాయ్ హోప్ (1), అక్షర్ పటేల్ (15), కెప్టెన్ రిషబ్ పంత్ (15) ఆశించిన మేర రాణించలేకపోయారు. ఈ దశలో ట్రిస్టాన్ స్టబ్స్ విరుచుకుపడడంతో ఢిల్లీ స్కోరు 200 మార్కు దాటింది. స్టబ్స్ 20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులు కొట్టాడు. 

ఐపీఎల్ తో తొలి మ్యాచ్ ఆడుతున్న గుల్బదిన్ నాయబ్ 15 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ తో 19 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, ట్రెంట్ బౌల్ట్ 1, సందీప్ శర్మ 1, చహల్ 1 వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News