Kiran Kumar Reddy: కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబే: మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి

Next CM is Chandrababu says Kiram Kumar Reddy
  • జగన్ పాలనలో దోపిడీలు, కబ్జాలు జరిగాయన్న కిరణ్ కుమార్ రెడ్డి
  • ఓటర్లంతా ధైర్యంగా ఓటు వేయాలన్న మాజీ సీఎం
  • వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపు

ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి... రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఐదేళ్ల జగన్ పాలనలో ఇసుక మాఫియా, దేవుని భూముల కబ్జా, దోపిడీ భారీగా జరిగాయని చెప్పారు. తంబళ్లపల్లెలో గర్భిణిపై వైసీపీ శ్రేణులు దాడి చేయడం దారుణమని అన్నారు. 

పోలీసులు కూడా ఓవరాక్షన్ తగ్గించుకోవాలని... పోలీసులకు జగన్ ఏమైనా మంచి చేశాడా? అని ప్రశ్నించారు. ఓటర్లందరూ ధైర్యంగా ఓటు వేయాలని... కేంద్ర బలగాలు అందరికీ రక్షణగా ఉంటాయని చెప్పారు. 2,036 పోలింగ్ బూత్ లలో వెబ్ కెమెరాతో నిఘా ఉంటుందని తెలిపారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా భ్రష్టు పట్టించిన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పిలుపునిచ్చారు. కేంద్రంలో, రాష్ట్రలో ఎన్డీయే ప్రభుత్వాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News