PV Ramesh: ల్యాండ్ టైట్లింగ్ చట్టానికి నేను ప్రత్యక్ష బాధితుడిని.. భూములపై హక్కులు నిరాకరిస్తున్నారు: మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్

I am the victim of land titling act says Retd IAS PV Ramesh
  • ఏపీలో ఆందోళన రేకెత్తిస్తున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్
  • తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేయలేదన్న పీవీ రమేశ్
  • నా పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల దుస్థితిని ఊహించలేమని వ్యాఖ్య

ఎన్నికలకు ముందు ఏపీలో ల్యాండ్ టైట్లింగ్ అంశం దుమారం రేపుతోంది. ప్రజల ఆస్తులను కాపాడేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని అధికార వైసీపీ చెపుతుండగా... సొంత ఆస్తులకు సంబంధించి ప్రజల వద్ద జిరాక్స్ కాపీ తప్ప మరేమీ ఉండదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలను ఈ చట్టం ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... ఈ చట్టానికి తాను కూడా బాధితుడిగా మారానని తెలిపారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అని చెప్పారు. 

కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన తన తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారని పీవీ రమేశ్ తెలిపారు. తహసీల్దార్ తన దరఖాస్తును తిరస్కరించారని చెప్పారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారని తెలిపారు. చట్టం అమలులోకి రాకముందే తన తల్లిదండ్రుల భూములపై తనకు హక్కులు నిరాకరించబడుతున్నాయని విమర్శించారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితే ఇలా ఉంటే... సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేమని చెప్పారు.

  • Loading...

More Telugu News