ED Raids: కరెన్సీ కట్టల గుట్ట.. ఝార్ఖండ్‌లో ఈడీ సోదాలలో బయటపడ్డ భారీ నగదు

ED Officials found Huge Cash in Jharkhand Minister Aide house in Ranchi
  • ఝార్ఖండ్ మంత్రి ఆలంగీర్ ఆలం పీఎస్ నివాసంలో రూ.25 కోట్ల నగదు గుర్తింపు
  • లెక్కా పత్రం లేని నగదుగా ప్రకటించిన ఈడీ అధికారులు
  • మనీలాండరింగ్ కేసులో రాంచీలోని 9 ప్రదేశాల్లో ఏకకాలంలో సోదాలు

ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఏకకాలంలో జరిపిన దాడుల్లో కరెన్సీ నోట్ల గుట్ట బయటపడింది. ఝార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్, అతనికి సంబంధించిన వ్యక్తుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా ఏకంగా రూ.25 కోట్ల నగదును గుర్తించామని తెలిపారు. ఝార్ఖండ్ రూరల్ డెవలప్‌మెంట్ మంత్రి ఆలంగీర్ ఆలం పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ ఇంట్లో ఈ భారీ నగదును గుర్తించారు.

ఈ నగదుకు సంబంధించి ఎలాంటి లెక్కా పత్రాలు లేవని అధికారులు వెల్లడించారు.` మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎమ్‌ఎల్‌ఏ) కింద ఫిబ్రవరి 2023లో అరెస్ట్ అయిన వీరేంద్ర రామ్‌కు సంబంధించిన ఆరు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్టు తెలిపారు. కాగా నగదుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక గదిలోని కరెన్సీ నగదు కట్టలు వీడియోలో కనిపిస్తున్నాయి.

 సోమవారం ఉదయం రాంచీలోని సెయిల్ సిటీతో సహా తొమ్మిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించామని ఈడీ వెల్లడించారు. మరోవైపు రోడ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఇంజనీర్ వికాస్ కుమార్ ఆచూకీ కోసం మరో ఈడీ బృందం బరియాతు, మోరబాది, బోడియా ప్రాంతాల్లో దాడులు నిర్వహించిందని అధికారులు వివరించారు.

  • Loading...

More Telugu News