Congress: అమేథీలో అర్ధరాత్రి కాంగ్రెస్ కార్యాలయంపై గూండాల దాడి.. పదుల సంఖ్యలో కార్ల ధ్వంసం

Congress Amethi office attacked cars vandalised

  • కార్యాలయం బయట పార్క్ చేసిన కార్లపై ప్రతాపం
  • వీడియో షేర్ చేసిన కాంగ్రెస్ పార్టీ
  • బీజేపీ గూండాల పనేనని ఆరోపణ
  • అమేథీలో ఓడిపోతామన్న భయంతోనే ఈ దౌర్జన్యానికి పాల్పడిందన్న కాంగ్రెస్

ఉత్తరప్రదేశ్‌, అమేథీలోని కాంగ్రెస్ కార్యాలయంపై గత అర్ధరాత్రి దాడి జరిగింది. కార్యాలయం బయట పార్క్ చేసిన పదుల సంఖ్యలోని వాహనాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి ఆ ప్రాంతంలో గందరగోళం సృష్టించారు. ఆపై అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

ఈ దాడి బీజేపీ పనేనని కాంగ్రెస్ ఆరోపించింది. పగిలిన కార్ల అద్దాలు, గాజు ముక్కలతో చెల్లాచెదురుగా పడివున్న పరిసరాల వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. అమేథీలో ఓటమి తప్పదన్న భయంతోనే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది. కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాట్ మాట్లాడుతూ బీజేపీ దౌర్జన్యాలు పెచ్చరిల్లుతున్నాయని దుమ్మెత్తి పోశారు. కాగా, అమేథీ, రాయ్‌బరేలీలో నేడు ప్రియాంకగాంధీ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ దాడి జరగడం గమనార్హం.

  • Loading...

More Telugu News