Bhadrachalam: ఒకటే వీధి.. తండ్రిది ఆంధ్రా.. కొడుకుది తెలంగాణ!

On Street Divided As Andhra And Telangna
  • భద్రాచలంలోని రాజుపేటలో విచిత్ర
  • రోడ్డుకు అటువైపున తండ్రి ఇల్లు, ఇటువైపున కుమారుడి ఇల్లు
  • తండ్రి అరకు లోక్‌సభ స్థానం పరిధిలోకి.. కుమారుడు మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి
ఒకే ఊరు రెండు వేర్వేరు జిల్లాల పరిధిలో ఉండడం, లేదంటే రెండు రాష్ట్రాల పరిధిలో ఉండడం మనకు తెలుసు. కానీ, భద్రాచలంలోని ఓ వీధి ఒకవైపు తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తోంది. తండ్రీ కొడుకులు నిర్మించుకున్న ఇళ్లలో ఒకటి తెలంగాణ పరిధిలోకి వస్తే, మరోటి ఆంధ్రప్రదేశ్‌లోకి చేరింది. లోక్‌సభ ఎన్నికల వేళ ఇది ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉండగా ఖమ్మం జిల్లా భద్రాచలంలోని రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నాడు. ఆ తర్వాత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయింది. రాజుపేటలోని ఓ వీధి ఓవైపు తెలంగాణలోని మహహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తే, మరోవైపున్న ప్రాంతం ఏపీలోని అల్లూరు సీతారామరాజు జిల్లా అరకు లోక్‌సభ పరిధిలోకి వెళ్లాయి.

ఈ క్రమంలో శ్రీనివాస్ ఇల్లు అరకు లోక్‌సభ స్థానం, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి చేరింది. అదే వీధిలో తండ్రి ఇంటికి ఎదురుగా రోడ్డుకు అవతలి వైపున ఇల్లు కట్టుకున్న శ్రీనివాస్ కుమారుడు జానకీరామ్ తెలంగాణలోని మహబూబాబాద్ లోక్‌సభ పరిధిలోకి వెళ్లిపోయాడు.
Bhadrachalam
Khammam District
Araku
Mahabubabad District
Andhra Pradesh
Telangana

More Telugu News