అమిత్ షా ఫేక్ వీడియో కేసులో ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ నేతల అరెస్ట్
- బీజేపీ నేత ప్రేమేందర్ ఫిర్యాదుపై కేసు నమోదు
- మన్నె సతీశ్, నవీన్, తస్లీమా అరెస్ట్
- ఇదే కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రెండ్రోజుల క్రితమే ఢిల్లీ పోలీసుల నోటీసులు
కాగా, ఇదే కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మొన్ననే ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అస్సాం కాంగ్రెస్ యూనిట్ వార్ రూమ్ కోఆర్టినేటర్ రితోమ్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా మరో 10 మంది కాంగ్రెస్ నాయకులకు నోటీసులు జారీ చేశారు. తాజాగా, ప్రేమేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన తెలంగాణ పోలీసులు ముగ్గురు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.