Balanagi Reddy: మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి నిరసన సెగ

Protest to YSRCP MLA Balanagi Reddy
  • ప్రచారంలో బాలనాగిరెడ్డిని నిలదీసిన అగసలదిన్నె గ్రామ మహిళలు
  • మూడు సార్లు గెలిపించినా తాగునీటి సమస్య తీర్చలేదని మండిపాటు
  • ఇప్పుడు గెలిపిస్తే.. సమస్య పరిష్కరిస్తానన్న ఎమ్మెల్యే

మరో 10 రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులంతా మండుటెండలను సైతం లెక్క చేయకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు, పలుచోటు పలువురు అభ్యర్థులకు ఓటర్ల నుంచి నిరసన సెగ ఎదురవుతోంది. తాజాగా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి కూడా అలాంటి అనుభవమే ఎదురయింది. 

నియోజకవర్గంలోని కౌతాళం మండలం అగసలదిన్నెలో ఆయన ప్రచారం నిర్వహిస్తుండగా గ్రామస్థులు, మహిళలు ఆయనను తాగునీటి సమస్యపై నిలదీశారు. మిమ్మల్ని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా తాగు నీటి సమస్యను తీర్చలేదని వారు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వస్తారని... ఆ తర్వాత కనిపించరని మండిపడ్డారు. ఈసారి గెలిపించండి... ఎన్నికల తర్వాత తాగునీటి సమస్యను పరిష్కరిస్తానని ఆయన వాగ్దానం చేశారు. 

  • Loading...

More Telugu News