Dada Saheb Phalke Film Festival: టాలీవుడ్ నటుడు నవీన్ చంద్రకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు

Tollywood Actor Naveen Chandra Got Dada Saheb Phalke Film Festival Award
  • మంత్ ఆఫ్ మధు’ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడి అవార్డు
  • 2011లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఎంట్రీ
  • గుర్తింపు తీసుకొచ్చిన ‘ఇన్‌స్పెక్టర్ రుషి’ వెబ్ సిరీస్ 
టాలీవుడ్ నటుడు నవీన్‌చంద్ర ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ‘మంత్ ఆఫ్ మధు’ మూవీలో ఆయన నటనకు గాను ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్, ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 

తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఇప్పటికే నటుడిగా సత్తా చాటిన నవీన్ చంద్ర 2011లో ‘అందాల రాక్షసి’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.  ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ వంటి పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘ఇన్‌స్పెక్టర్ రుషి’ వెబ్‌సిరీస్ ఆయనకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. కథాబలం ఉన్న సబ్జెక్ట్‌లనే ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న నవీన్‌చంద్ర ఉత్తమ నటుడి అవార్డు అందుకోవడంపై టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Dada Saheb Phalke Film Festival
Naveen Chandra
Month Of Madhu
Tollywood

More Telugu News