Harish Rao: రఘునందన్ తప్పుడు ప్రచారం మానుకోవాలి: హరీశ్ రావు

Harish Rao says Raghunandan should stop fake statments on brs
  • మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్న హరీశ్ రావు
  • బీఆర్ఎస్‌పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆగ్రహం
  • గతంలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు వదిలారని వ్యాఖ్య
మెదక్ లోక్ సభ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థిపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేటలో వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... వెంకట్రామిరెడ్డికి ప్రజలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారన్నారు. బీఆర్ఎస్‌పై బీజేపీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

గతంలో దుబ్బాక నుంచి నకిలీ వీడియోలు చేసి వదిలారని ఆరోపించారు. బీజేపీ అబద్దాలు విని, వీడియోలు చూసి ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రజలకు సేవ చేసేందుకే వెంకట్రామిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఆయన మచ్చలేని మనిషి అన్నారు. అంతకుముందు ఉప ఎన్నికల్లో బీజేపీ తప్పుడు ప్రచారం చేసి గెలిచిందని విమర్శించారు.
Harish Rao
Raghunandan Rao
BJP
Medak District

More Telugu News