Prathipati Pulla Rao: జగన్ మన భూములు లాక్కున్నా అడిగేవాడుండడు: ప్రత్తిపాటి

Nobody will question even after Jagan grabs our lands says Prathipati Pulla Rao
  • జగన్ మళ్లీ సీఎం అయితే మన భూములను తాకట్టు పెట్టేస్తాడన్న ప్రత్తిపాటి
  • రైతుల పాస్ బుక్కులపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్న
  • కూటమి అధికారంలోకి వస్తే ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేస్తామని వ్యాఖ్య
సీఎం జగన్ మళ్లీ సీఎం అయితే మన భూములను కూడా తాకట్టు పెట్టేస్తారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ మన భూములను లాక్కున్నా అడిగేవాడు ఉండడని చెప్పారు. వైసీపీ కబ్జాల నుంచి మన ఆస్తులను కాపాడుకోవాలంటే ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఆస్తుల శాశ్వత హక్కుల పత్రాలపై ఐదేళ్లుండే పాలకుడి ఫొటోలు ఎందుకని ప్రశ్నించారు. రైతుల పాస్ బుక్కులపై జగన్ ఫొటోలు ఎందుకని అన్నారు. 

భూముల హక్కులపై జగన్ పిచ్చిపిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని తెలిపారు. కూటమి మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నామని చెప్పారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రం వెనక్కి వెళ్లిపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ బాగు చేసుకోవాలంటే చంద్రబాబును మళ్లీ సీఎంను చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంటుందని చెప్పారు. 

Prathipati Pulla Rao
Telugudesam
Jagan
YSRCP

More Telugu News