Paragliding Crash: పారాగ్లైడింగ్ ప్రమాదం.. తీవ్ర గాయాలపాలైన యూట్యూబర్! వీడియో ఇదిగో!

YouTuber Falls 85 Feet From Paraglider In US
  • అమెరికాలోని రాక్ స్టేట్ పార్క్‌లో  ఘటన 
  • మోటార్ సాయంతో పారాగ్లైడింగ్ చేసిన యూట్యూబర్
  • 100 అడుగుల ఎత్తులో ఉండగా అదుపుకోల్పోయి కింద పడ్డ వైనం
  • యూట్యూబర్ మెడ, వెన్ను, చేతులు విరగడంతో శస్త్రచికిత్సలు చేసిన వైద్యులు
  • ప్రమాదం తాలూకు వీడియో నెట్టింట వైరల్

అత్యంత ప్రమాదకరమైన సాహస క్రీడల్లో పారాగ్లైడింగ్ కూడా ఒకటి. పారాగ్లైడింగ్ ప్రమాదాల్లో ఎందరో నేలకొరిగారు. తాజా ఘటనలో ఆంథొని వెల్లా అనే యూట్యూబర్ పారాగ్లైడింగ్ చేస్తూ 100 అడుగుల ఎత్తు నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గల రాక్ స్టేట్ పార్క్‌లో ఈ ఘటన జరిగింది. బాధితుడి మెడ, తుంటె, వీపు భాగాల్లోని పలు ఎముకలు విరిగిపోవడంతో శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. 

ఆంథోనీ వెల్లా ప్రమాదం తాలూకు దృశ్యాలు అతడి కెమెరాకు చిక్కాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అతడు ఓ మోటారు సాయంతో పారాగ్లైడింగ్ చేశారు. దీన్ని పారామోటరింగ్ అంటారు. అయితే, ఆంథోనీ సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండగా అదుపుకోల్పోయాడు. పారామోటార్‌ను అదుపు చేయలేక చివరకు కిందపడ్డాడు. చెకింగ్ సందర్భంగా ఓ చిన్న లోపం గుర్తించలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని అతడు వివరించాడు. 

దాదాపు 100 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ అతడు తీవ్ర గాయాల పాలై ఆక్రందనలు చేశాడు. ఈ క్రమంలో అటువైపు నుంచి వెళుతున్న కొందరు ఆంథోనీని గుర్తించి, అత్యవసర సిబ్బంది అతడి భార్యకు సమాచారం అందించారు. 

ప్రస్తుతం తన భర్త కోలుకుంటున్నాడని అతని భార్య సోషల్ మీడియాలో పేర్కొంది. అతడిని కాపాడిన వారికి, వైద్యులకు ధన్యవాదాలు తెలిపింది. చేతులు, వీపునకు కొన్ని ఆపరేషన్లు జరిగాయని, మరికొన్ని శస్త్రచికిత్సలు కూడా చేయాల్సి ఉందని ఆమె తెలిపింది. మరికొన్ని వారాల పాటు ఆసుపత్రిలోనే ఉండాలని కూడా చెప్పింది. కాగా, ఆంథోనీ చికిత్సకు నిధుల సేకరణ కోసం గోఫండ్‌మీ పేజీ కూడా ఏర్పాటు చేశారు. 


  • Loading...

More Telugu News