KCR: 'నా రైతుబంధు ఇంకా రావాలి': మంత్రి తుమ్మల వ్యాఖ్యల వీడియోను ట్వీట్ చేసిన కేసీఆర్... వీడియో ఇదిగో

Congress has betrayed farmers of Telangana by not giving Rythu Bandhu says kcr
  • ఉద్యోగులకు వేతనాలు ఇచ్చాక తన మిగిలిన రైతుబంధు ఇస్తానని చెప్పారన్న తుమ్మల వీడియో 
  • తన రైతుబంధు గురించి మాట్లాడిన తుమ్మల
  • కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వకుండా ఎలా ద్రోహం చేసిందో మంత్రి ప్రకటనతో తెలిసిపోతుందని వ్యాఖ్య 
తనకు రైతుబంధు రాలేదన్న మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణలో రైతుబంధు పడటం లేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే విపక్షాలు అబద్దాలు చెబుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం కౌంటర్ ఇస్తోంది. ఈ క్రమంలో స్వయంగా మంత్రి తుమ్మల మాట్లాడిన వీడియోను బీఆర్ఎస్ అధినేత ట్వీట్ చేశారు.

ఈ వీడియోలో 'నా రైతుబంధు ఇంకా కొద్దిగా రావాలి ఇవ్వమంటే ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన తర్వాత ఇస్తానని చెప్పారు పెద్దాయన' అంటూ తన పక్కనే ఉన్న ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను చూపిస్తూ అన్నారు. దీనిని ట్వీట్ చేసిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు రైతుబంధు ఇవ్వకుండా ఎలా ద్రోహం చేసిందో వ్యవసాయ మంత్రి ప్రకటనతో తెలిసిపోతుందని పేర్కొన్నారు.
KCR
Thummala
Lok Sabha Polls

More Telugu News