నేనేదో జగన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నానని ఆయన భార్య, ఏ2 మాట్లాడుతున్నారు: చంద్రబాబు

Chandrababu slams YS Jagan and his wife
  • ఏలూరు జిల్లా దెందులూరులో ప్రజాగళం సభ
  • హాజరైన చంద్రబాబు
  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
  • నోటికి గట్టిగా వాత పెట్టాలని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు దెందులూరు ప్రజాగళం సభలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తానేదో చంపేయడానికి ప్రయత్నిస్తున్నానని జగన్ అంటున్నాడని, ఆయన భార్య కూడా మాట్లాడుతోందని, ఏ2 కూడా అదే మాట అంటున్నాడని విమర్శించారు. 'వీళ్లకు తప్పుడు ప్రచారం అలవాటైపోయిందని, ఆ నోటికి గట్టిగా వాత పెట్టి, శాశ్వతంగా మూసేస్తే తప్ప సిగ్గురాని మనుషులు..' అంటూ చంద్రబాబు మండిపడ్డారు. 

"మీరు చేసే పనులను మాపై నెట్టాలనుకుంటున్నారు. మా ఊర్లో, మా ప్రాంతంలో హత్యా రాజకీయాలు లేవే! ఇక్కడ దెందులూరులో, పశ్చిమ గోదావరి జిల్లాలో హత్యా రాజకీయాలు ఉన్నాయా? ఎందుకు పులివెందులో ఉన్నాయి? నువ్వే కారణం... అవునా, కాదా?" అంటూ  నిలదీశారు.
Go Back to Shorts
Chandrababu
Jagan
YS Bharathi
Vijayasai Reddy
Denduluru
Praja Galam
TDP
YSRCP

More Telugu News