Pawan Kalyan: జనసేన పిఠాపురం అభ్యర్థి: కొణిదెల పవన్ కళ్యాణ్... EVM బ్యాలెట్ నెంబర్: 04

Pawan Kalyan at 4th row in Pithapuram EVM ballot order
  • ఏపీలో నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తి
  • నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల తుది జాబితాలు ఖరారు
  • పిఠాపురం ఈవీఎం బ్యాలెట్ ఆర్డర్ లో 4వ స్థానంలో పవన్ పేరు

ఏపీలో నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దాంతో ఆయా అసెంబ్లీ, లోక్ సభ నియోజకవర్గాల అభ్యర్థుల తుది జాబితాలను ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంలో అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించారు. 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ పేరు బ్యాలెట్ ఆర్డర్ లో ఎక్కడ ఉందో జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. జనసేన పిఠాపురం అభ్యర్థి: కొణిదెల పవన్ కళ్యాణ్... EVM బ్యాలెట్ నెంబర్: 04 అంటూ తన ప్రకటనలో వివరించింది.

ఈవీఎం బ్యాలెట్ ఆర్డర్ లో పవన్ కల్యాణ్ పేరు నాలుగో స్థానం లో ఉంది. పక్కనే గాజు గ్లాసు గుర్తు ఉంది. ఈవీఎంపై 4వ నెంబరు నొక్కి పిఠాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కల్యాణ్ ను అఖండ మెజారిటీతో గెలిపిద్దాం అని జనసేన పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది.

  • Loading...

More Telugu News